పేట కోటపై పార్లమెంట్ జెండా ఎగరేసేదెవ్వ‌రు..?పేట కోటపై పార్లమెంట్ జెండా ఎగరేసేదెవ్వ‌రు..?
ఆ ఇద్దరి మధ్యే హోరా..హోరి ఫైట్
 
నరసరావుపేట,జనవారధి: గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ కోటపై  లో ఏ జెండా ఎగురుతుంది..?35ఏళ్ళ అనుభవమున్న రాజకీయ ఉద్దండుడు రాయపాటికి మరో అవకాశం రానుందా..?మూడు పదుల వయసులోనే ముప్పైఅయిదేళ్ళ అనుభవాన్ని ఢీ కొట్టడం లావుకు సాధ్యమేనా..?ఇరు పార్టీల పార్లమెంట్ సారధులు ఒకే సామాజిక వర్గం కావటంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో..?అంటూ విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.ఇక్కడ నుండి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్ధులు గుంటూరు నుంచి వచ్చిన వారే కావటం విశేషం.ఇక్కడ టిడిపి వర్సెస్ వైసిపి పోటీ ఎలా ఉ‍ంది..?అనేది చర్చనీయాంశమయ్యింది.తెదేపా అధినేత చంద్రబాబు,వైసిపి అధినేత జగన్ లు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం..ఒకవైపు రాజకీయ ఉద్దండులు రాయపాటి, కన్నా లక్ష్మీనారాయణలు టిడిపి,బిజేపి నుండి పోటీ చేస్తుంటే మధ్యలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని విధ్యాధికుడు లావు శ్రీకృష్ణదేవరాయులు పోటీకి నిలవడం జిల్లాలోనే అత్యంత ఆసక్తికర సమరంగా నెలకొంది.
 
గెలుపుపై రాయపాటి ధీమా..!
బిజేపి నుండి కన్నా పోటీలో ఉన్నా.. ప్రధానంగా రాయపాటి,లావుల మధ్యే హోరా..హోరి పోరు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.గత ఐదేళ్ళల్లో నియోజకవర్గాన్ని వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని,ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్నికల ప్రచారంలో రాయపాటి ప్రజలకు వివరిస్తున్నారు.గత ఐదేళ్ళ పాలనలో రాయపాటిపై స్ధానికుల్లో ఎటువంటి అవినీతి,అసంతృప్తి లేదనేది వాస్తవం.గ్రూపులు,వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించటం,కలుపుకుపోవటం,క్షేత్ర స్ధాయిలో తెదేపాకు బలమైన క్యాడర్ ఉండటం ఆయనకు అనుకూలి‍ంచే అంశాలు.
 
అభివృద్ధి,సంక్షేమ పధాకలతోపాటు
సత్తెనపల్లి,పెదకూరపాడు,చిలకలూరిపేట,వినుకొండ,గురజాలలోని బలమైన‌ అసెంబ్లీ అభ్యర్ధులు బరిలో ఉండటంతో గతంలో కంటే ఈసారి భారీ మెజార్టీ రావటం ఖాయం అని రాయపాటి వర్గీయులు బలమైన ధీమాను వ్యక్తం చేస్తున్నారు.రాయపాటికి తోడుగా ఆయన తనయుడు రంగారావు,కోడలు మమత‌,కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
 
లావుకు అంత ఈజీ కాదా..?
మొదటిసారి రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూనే రాజకీయ ఉద్దండులను ఢీకొనబోతున్న యువకుడు,విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు ఈ ఎన్నికల్లో ఆకర్షణగా నిలిచారు.రాజకీయంగా ఎటువంటి అనుభవం లేకపోయినా..అధినేత జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.ఒక్కసారి జగనన్నకు అవకాశమివ్వండి అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.తనను గెలిపిస్తే యువ శక్తిగా పార్లమెంట్ లో జగన్ కు అండగా ఉంటానని, స్ధానిక సమస్యలపై పోరాటం చేస్తానంటున్నారు.  రాజకీయాల్లో యువతకు అవకాశమివ్వాలని అభ్యర్ధిస్తున్నారు. శ్రీకృష్ణుడి ఆశలు,బలమంతా అసెంబ్లీ అభ్యర్ధుల విజయంపై,జగన్ మానియాపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మాచర్ల,సత్తెనపల్లి,వినుకొండ,చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు విజయం సాధిస్తే..,జిల్లాలో జగన్ గాలి వీస్తే లావుకు ఈజీనే.