పేటలో ప్రవాస భారతీయుల‌ ప్రచారంపేటలో ప్రవాస భారతీయుల‌ ప్రచారం
జండా ఊపి ప్రారంభించిన‌ రాయపాటి
 
నరసరావుపేట,జనవారధి:తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఎల్ ఈడి ప్రచార రథానికి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు,అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబులు ప్రచారానికి గురువారం నాడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఎం ఆర్ ఓ ప్రచార కార్యక్రమం జిల్లా సమన్వయకర్తలు డాక్టర్ రాయపాటి శైలజ, మేదరమెట్ల మల్లికార్జున్ లు మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  నారా చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి కారణంగా లక్షలాదిమంది  విదేశాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
 
పోలవరం నిర్మాణం రాజధాని నిర్మాణం జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో 12 ప్రచార రథాలు ఏర్పాటు చేశామన్నారు.అందులో భాగంగా నరసరావుపేటకు వాహనాన్ని పంపామని ప్రకటించారు. ఎన్నారై లతో సంబంధిత గ్రామస్తులను ప్రచార వాహనం లో ఎల్ ఈడి ల ద్వారా అనుసంధానించి టిడిపి ప్రభుత్వం ఆవశ్యకతను వివరిస్తామని  తెలిపారు.