సంక్షేమానికి పట్టం కట్టండి - రాయపాటి మమతమాచర్ల, జనవారధి :-   రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషిచేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టండి అని ఎంపీ రాయపాటి కోడలు డాక్టర్ మమత ఓటర్లను కోరారు. గురువారం నాడు మాచర్ల పట్టణంలోని కెసిపి కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కాలనీలో విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. సందర్భంగా రాయపాటి మమత మాట్లాడుతూ లోటుబడ్జెట్ తో మొదలైన మన రాష్ట్రాన్ని నేడు అభివృద్ధి మరియు సంక్షేమంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి తీసుకువచ్చిన చంద్రబాబుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. 
 
 
నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల మరియు గురజాల వినుకొండ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీటి సమస్యను అధిగమించాలనే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని తీవ్రoగా  కృషి చేసి సాధించారన్నారు. అలాగే ఉన్నత విలువలు కలిగిన కుటుంబం నుండి వచ్చిన అంజిరెడ్డి ప్రజాసమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఆమె తెలిపారు. రెంటచింతల మండలంలోని తుమృకోట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో పర్యటించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ సందర్భంగా రాయపాటి మమత మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకై ఎంపీ రాయపాటి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ రాయపాటి, అంజి రెడ్డి ల గెలుపు కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు