మళ్ళీ మీరే రావాలి - మీ అభివృద్ధి కొనసాగాలిమళ్ళీ మీరే రావాలి
మీ అభివృద్ధి కొనసాగాలి
కోడెల ప్రచారానికి ప్రజల స్పందన‌
కోడెలతో కాపు నాయకుడు సాయి సుధాకర్ ప్రచారం
 
నకిరికల్లు,జనవారధి:అడుగడుగునా జననీరాజనం..అభివృద్ధి ప్రధాతకు గ్రామల్లో ఘనస్వాగతం.మళ్ళీ మేరే రావాలంటూ..ఈ అభివృద్ధి కొనసాగాలంటూ నకిరికల్లు మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోడెలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.మనసారా దీవిస్తున్నారు.మా ఓటు మీకేనంటూ,మిమ్మల్ని గెలిపించుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరికల్లు మండలంలో కాపు నాయకుడు మంచాల సాయి సుధాకర్ తో కలసి పలు గ్రామల్లో పర్యటించారు.
 
ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ..మీరు వేసిన ఒక్క ఓటుతోనే ఐదేళ్ళ పాటు మీ గ్రామాలను పట్టణాలతో పోటీగా అభివృద్ధి చేశామన్నారు.సాంకేతిక వనరులను మెరుగుపరిచానన్నారు.ప్రతి గ్రామంలోనూ కనీసం పది కోట్ల రూపాయల నిధులు వెచ్చించానన్నారు.నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించానని,ఇంకా ఏమైనా అపరిష్కృతంగా ఉంటే మళ్ళీ అధికారంలోకి రాగానే వాటిపై దృష్టిపెడతానని పేర్కొన్నారు.
 
మంచాల మాట్లాడుతూ..కోడెల శివప్రసాదరావు మాత్రమే అన్ని సమాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతిస్తారన్నారు.రాజుపాలెం,నకిరికల్లు మండలాల్లో కాపు సమాజిక వర్గానికి మండల అధ్యక్షులుగా,మండల స్ధాయి పార్టీ పదవులు,పలు దేవాలయాల్లో బోర్డ్ సభ్యులుగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు.అభివృద్ధి,స‍క్షేమం సమపాళ్ళలో అందించిన‌ చంద్రబాబు నాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.