రాబోయేది జనసేన ప్రభుత్వమే:యర్రం



రాబోయేది జనసేన ప్రభుత్వమే:యర్రం
సత్తెనపల్లిలో విజయం ఖాయం
ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు
 
సత్తెనపల్లి,జనవారధి:రాష్ట్ర‍లో రోజు రోజుకు జనసేన పార్టీకి మద్దతు పెరుగుతోందని,అధినేత పవన్ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో అత్యధిక స్ధానలు కైవసం చేసుకొని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని సత్తెనపల్లి జనసేన అసెంబ్లీ అభ్యర్ధి యర్రం వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోమి రుద్రారం,తొండపి,కంకణాలపల్లి,వెన్నాదేవి,చాగంటివారిపాలెం గ్రామల్లో విసృతంగా పర్యటించారు.
 
ఆయా గ్రామాల్లో యర్రం మాట్లాడుతూ..సత్తెనపల్లిలో జనసేన గెలుపు దిశగా దూసుకుపోతుందన్నారు.ఓటమి భయంలో ప్రధాన పార్టీ అభ్యర్ధులు తనపై విమర్శలు చేస్తున్నారని,వాటిపై బహిరంగంగా మీడియా ముఖంగా,ప్రజల సమక్షంలో సవాల్ విసిరినా స్పందించలేదన్నారు.ప్రజలు అమాయకులు కారని,ఈ ఎన్నికల్లో అలాంటి నాయకులకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యర్రంకు  స్ధానికుల నుంచి మంచి స్పందన లభించింది.పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.జై పవన్..జై జనసేన అంటూ నినాదాలు చేశారు.
 
కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాళ్ళూరి మోహనబాబు,కె.శివపార్వతి,మాలంపాటి సౌజన్య, సిపిఐ నాయకులు నరిశేటి వేణుగోపాల్,సిపిఎం నాయకులు మామిడి వెంకటేశ్వరరావు,పెండ్యాల మహేష్,రొంపిచర్ల పురుషోత్తం,మునగ జ్యోతి,భూతం భాస్కరరావు,శిరిగిరి మణికంఠ,పోతంశెట్టి వెంకటేష్,వల్లూరి అనీల్ కుమార్,అభిరామకృష్ణ తదితరులున్నారు.