టాస్ గెలిచిన ఆస్ట్రేలియా...బౌలింగ్ లో భారత్ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ భారత్‌కు బౌలింగ్ అప్పగించాడు. వికెట్ పొడిగా కనిపిస్తోందని, అందుకే మొదట బ్యాటింగ్ చేయాలని అనుకుంటాన్నమని చెప్పాడు. భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని భావిస్తున్నామన్నాడు. రిచర్డ్‌సన్‌ స్థానంలో అలెక్స్ కారేను తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా వెస్టర్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆష్టన్ టర్నర్ ఆరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. 
 
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. నేల చాలా గట్టిగా ఉందని, బ్యాటింగ్ చేయడానికి బాగా సహకరిస్తుందన్నాడు. న్యూజిలాండ్‌లో ఎలాంటి ఫలితాన్ని రాబట్టామో ఇక్కడ కూడా అదే చేయాలని అనుకుంటున్నామని కోహ్లీ తెలిపాడు. జట్టు సమతూకంగా ఉందన్నాడు. చాహల్‌కు విశ్రాంతినిచ్చామని చెప్పాడు. మణికట్టు స్పిన్నర్లను రొటేట్ చేస్తున్నామని, టాప్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించాడు. కాగా, ఉప్పల్ స్టేడియంలో ఎక్కువ సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. దీనికి తోడు ఇక్కడ ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో భారత్ ఓడింది.