వరుసగా రెండోసారి నేషనల్ ఛాంపియన్‌గా సైనా



నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్లో సైనా నెహ్వాల్ మరోసారి సత్తా చాటింది. మహిళల సింగ్స్‌ ఫైనల్లో వరుసగా రెండో ఏడాది సింధుపై విజయం సాధించింది. శనివారం గువహటిలో జరిగిన తుదిపోరులో 21-18, 21-15 తేడాతో వరుస గేముల్లో గెలుపొందింది. అర గంటలోనే మ్యాచ్‌ను ముగించిన సైనా.. ఆద్యంతం ఆధిపత్యాన్ని చెలాయించింది. తొలి గేమ్‌ను మెల్లగా ఆరంభించిన సైనా 5-5తో సింధును సమం చేసింది. తర్వాత దూకుడు పెంచిన ఆమె 11-10 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింద. 
 
అదే దూకుడుతో 21-18 తేడాతో తొలి గేమ్‌ను గెలుచుకుంది. స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడంలో ఇబ్బంది పడ్డ సింధూ.. రెండో గేమ్‌ను కూడా సైనాకు కోల్పోయింది. నేషనల్ టైటిల్‌ను గెలవడం సైనాకు ఇది నాలుగోసారి. 2006, 2007, 2018ల్లోనూ హైదరాబాదీ షట్లర్ ఈ టైటిల్‌ను గెలుపొందింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మ గెలుపొందాడు. ఫైనల్లో ఏసియన్ జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్‌ను వరుస గేముల్లో ఓడించాడు.