పంత్ కు వన్డేల్లోనూ చాన్స్ ఇవ్వాలి...అనీల్ కుంబ్లే!



భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి వన్డేల్లోనూ ఛాన్స్ ఇచ్చి పరీక్షించాలని దిగ్గజ స్పిన్నర్ అనీల్ కుంబ్లే సూచించాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌లో రిషబ్ పంత్‌ని పక్కనపెట్టిన సెలక్టర్లు.. టీ20 సిరీస్‌లో మాత్రం అవకాశం ఇచ్చారు. కానీ.. వెల్లింగ్టన్ వేదికగా నిన్న ముగిసిన తొలి టీ20లో 10 బంతులు ఎదుర్కొన్న  రిషబ్ పంత్ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో.. అతడిపై విమర్శలు చెలరేగగా.. అనిల్ కుంబ్లే అతనికి మద్దతుగా నిలుస్తూ వన్డేల్లోనూ అవకాశాలివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కి సూచించాడు.  అవకాశమిస్తే తప్పకుండా రాణిస్తాడు’ అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు.