ఎట్టకేలకు న్యూజిలాండ్ గడ్డపై కప్ సాధించిన టీమిండియాహైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై పదేళ్ల తర్వాత వన్డే సిరిస్‌ను నెగ్గడంతో భారత క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించిది. దీంతో కివీస్ గడ్డపై వన్డే సిరిస్‌ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకుని కివీస్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
1967 నుంచి కివీస్‌ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్‌ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది.