న్యూజిలాండ్ ని 157కే కుప్పకూల్చిన భారత్..!న్యూజిలాండ్ పర్యటనని భారత్ బౌలర్లు ఘనంగా ఆరంభించారు. నేపియర్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ (4/39), మహ్మద్ షమీ (3/19), చాహల్ (2/43) ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (64: 81 బంతుల్లో 7x4) ఒక్కడే భారత్ బౌలర్లకి ఎదురునిలిచి.. సొంతగడ్డపై పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (5: 9 బంతుల్లో 1x4) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ 34వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి ఒక ఎండ్‌లో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. కానీ.. అతను ఔట్ తర్వాత.. కివీస్ ఏ దశలోనూ కోలుకోలేక వరుసగా వికెట్లు చేజార్చుకుని కుప్పకూలిపోయింది.