బ్రెడ్ తింటున్నారా.. కాస్త జాగ్రత్తగా ఉండండి!ఆధునిక జీవనశైలి కారణంగా ఒత్తిడి పెరుగుతోంది. శారీరకంగా, మానసికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మనం తినే ఆహారం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపతుందని తేలింది. గ్లూటెన్ కారణంగా ఉదర సంబంధ సమస్యల కంటే డిప్రెషన్ లాంటి రుగ్మతలే ఎక్కువగా వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. 
 
బ్రెడ్, పాస్తాలు తినేవారిలో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. 12 శాతం మందిలో గ్లూటెన్ కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తేల్చారు. బ్రెడ్ లాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఉద్వేగపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మెదడుపై గ్లూటెన్ ప్రభావం చూపుతోందని తెలిపారు. అయితే ఇది మరీ ఎక్కువ మందిపై కాదని, కొద్ది మందిపై మాత్రం దీని ఎఫెక్ట్ ఉంటుందన్నారు.