ప్రెగ్నెంసీ టైమ్ లో మదుమేహం కలిగిన స్త్రీలు తీసుకోవలసిన జాగత్రలు...!శరీరంలోని మధుమేహం అనబడే అనారోగ్య పరిస్థితి తలెత్తినపుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. 'ముందు నుండి మధుమేహం' ఉన్నా లేదా 'గర్భధారణ ముందు తలెత్తే మధుమేహం', అయినా, మీరు గర్భిణీ కాక ముందు నుండే మీకు. మధుమేహం ఉన్నట్లు సూచిస్తుంది. కొందరిలో 'గర్భధారణ మధుమేహం', అనగా గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలలో అభివృద్ధి చెందే ఒక రకమైన మధుమేహం, పైన చెప్పబడిన మధుమేహం నుండి భిన్నంగా ఉంటుంది. మీరు మధుమేహం ఉన్నప్పుడు, మీ శరీరం తగినంతగా ఇన్సులిన్ తయారు చేయలేదు లేదా ఇన్సులిన్ సరిగా ఉపయోగించుకోలేదు. అందువలన మీ రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉంటుంది. ఇది గుండె మరియు మూత్రపిండాల వ్యాధులు, మరియు అనేక ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
 
 
మధుమేహం జన్మతః ఆరోగ్య లోపాలను కలిగిస్తుందా? గర్భధారణ సమయంలో తల్లికి మధుమేహం ఉన్నట్లైతే, తప్పక చికిత్స అందించాలి. చికిత్స చేయకుండా వదిలేస్తే, తల్లికి మరియు ముఖ్యంగా ఆమె గర్భంలో అభివృద్ధి చెందుతున్న శిశువుకు కూడా తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. అందువల్ల, గర్భానికి ముందు మరియు గర్భధారణ సమయంలో మధుమేహ పరీక్షలు చేయడం మరియు చికిత్స చేయటం ద్వారా దుష్ప్రభావాలను నివారించవచ్చు.
 
గర్భధారణ ప్రణాళిక చేసుకునేటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఒక కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటే సరైన ప్రణాళిక అవసరం. ప్రత్యేకించి మధుమేహం ఉన్న స్త్రీలు అయితే, మారిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీని వలన మీ గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా మరియు సురక్షితంగా ఉండేటట్లు నిర్ధారించుకోవచ్చు.
 
• గర్భధారణకు కనీసం మూడు నుంచి ఆరునెలల ముందు నుండే, మధుమేహంను నియంత్రణలోకి తెచ్చుకోవాలి. మధుమేహానికి చికిత్స చేయకుండా వదిలేస్తే, గర్భధారణ సమయంలో జన్మ లోపాలు, అకాల పుట్టుక మరియు గర్భస్రావం వంటి సమస్యలకు దారితీస్తుంది.
 
• ముందు నుండి మధుమేహం ఉన్నవారయితే, వారి యొక్క మరియు గర్బస్థ శిశువు యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉందని నిర్ధారించుకోవడానికి తరచుగా వైద్యుని సందర్శించాలి.
 
• ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలులు మాత్రమే తినాలి. ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి. రక్తంలోని చక్కెర స్థాయిలను గర్భధారణ సమయంలో నియంత్రణలో ఉంచడానికి, ఆరోగ్యకరమైన భోజన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దీనిని రూపొందించడానికి వైద్యుని లేదా మధుమేహ నిపుణులను లేదా డైటీషియన్ తో మాట్లాడండి.