Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

భార్యను మోసం చేసిన కానిస్టేబుల్ పై వేటు

సత్తెనపల్లి, జనవారధి : భార్యను వేధించటమే కాకుండా మరొక వివాహం చేసుకున్నాడన్న కారణంగా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్నఎస్ సుందరా చారిపై జిల్లా ఎస్పీజయలక్షీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు అతడిని విధుల నుండి బహిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నశివ నాగ మల్లేశ్వరి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ సంఘటనపై స్టేషన్ లో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి వివరాలు ఉన్నతాధికారులకు పంపిచారు.సుందరా చారి నాగ మల్లేశ్వరిని మోసం చేసి రెండవ వివాహం చేసుకోవటంతో అతనిపై సి.ఆర్.నంబర్.173/2019, యు/ఎస్ 420, 493, 494, 495, 498‍ఎ క్రింద కేసు నమోదు చేయటంతో పాటు విధుల నుండి బహిష్కరించారు.

Related News

అమరావతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

చైర్మన్‌ పదవికి గురిపెట్టిన ఆ..నలుగురు

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: న్యాయవాది బగ్గి

అంబేద్కర్ కృషి మరువలేనిది: టిడిపి

పరివర్తన పాఠశాలలో అన్నదాన కార్యక్రమం

నెహ్రూ యువ కేంద్రం,ఎడ్యుకేట్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి

సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంబటి

ప్రజ్వలన ఆధ్వర్యంలో 1000 జూట్ సంచుల పంపిణి