Home తాజా రాజకీయ సినిమా అమరావతి క్రీడలు హెల్త్ వీడియో About me

Home తాజా రాజకీయ అమరావతి హెల్త్ వీడియో About me

జగన్ కోరితే పదవి నుంచి తప్పుకుంటా...కొడాలి నాని!

ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తెలిపారు. బ్లాక్‌మార్కెట్‌ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తానని, అవినీతి రహిత పాలనకు పాటుపడతాని ఆయన పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పెంపు తదితర అంశాలపై ఆదివారం ‘‘ఆంధ్రజ్యోతి’’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మంత్రి పదవి రావడంతో బరువు, బాధ్యతలు పెరిగాయని భావిస్తున్నా. సీఎం జగన్మోహనరెడ్డి ఆశించిన ఫలితాన్ని చూపగలనో లేదో అనే ఆందోళన ఉన్నప్పటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నాకు కేటాయించిన శాఖలో ప్రగతి సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరుస్తాం. 
 
రేషన్‌ షాపుల్లో సక్రమంగా పేదలకు సరుకులు అందేలా చేస్తా. ధాన్యం కొనుగోలు, ధాన్యం రీ సైక్లింగ్‌, రిటైల్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చి బ్లాక్‌మార్కెట్‌ వ్యవస్థను కంట్రోల్‌ చేస్తాం. జగన్మోహనరెడ్డి తొమ్మిదేళ్లుగా నిత్యం జనంలో ఉన్నారు. పేదల కన్నీళ్లు, కష్టాలు, పూరి గుడిసెల్లో వారు పడుతున్న బాధలు చూశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల కిచ్చిన హామీల అమలే సీఎం జగన్మోహనరెడ్డి ఏకైక లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతంటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. పబ్లిసిటీకి ప్రభుత్వం దూరంగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గిస్తాం. అవినీతిని ఉక్కుపాదంతో అణుస్తాం. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే రూ.10 లక్షల కోట్లతో దుబారా తగ్గించి రూపాయికి 80 పైసలే ఖర్చు చేస్తాం.
 
ఈ వ్యయంతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి పేదలకు అందించగలుగుతాం. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, చేనేత, ఇతర వర్గాలకు పింఛన్లు ఇస్తాం. విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మధ్య, పేద వర్గాల పిల్లల విద్యకు చేయూతనిస్తాం. సాగు, తాగునీరు సకాలంలో ఇస్తాం. రానున్న ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా పాలన చేస్తాం.నాకు పదవే కాదు పార్టీ కూడా ముఖ్యమే. సీఎం ఆదేశిస్తే ప్రజల కోసం, ఆయన కోసం పదవి నుంచి తప్పుకుని పార్టీ వ్యవహారాలను చూస్తా. రాష్ట్రంలో వైసీపీని తిరుగులేని పార్టీగా బలోపేతం చేస్తా అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

Related News

19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం

చంద్రబాబుకు నిరసన సెగ

అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత

ఇంగ్లీష్ మీడియం బోధన:రాజకీయాల్లో హాట్ టాపిక్

కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా?

జియో కస్టమర్లకు మరో షాక్

మోదీతో పవార్ భేటీ

'వైఎస్సార్ నవశకం'

నూతన గవర్నర్ విశ్వభుషణ్ తో భేటి అయిన పవన్ ....

విజయవాడ: కలకలం రేపుతున్న కానిస్టేబుల్‌ ఆత్మహత్య...